Posts

తెలంగాణ తల్లి ప్రార్థనాగీతం

గీతరచన: ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి, సంగీతదర్శకత్వం: డా. బిరాధ, గాయనీగాయకులు: శ్రీమతి కల్పన, శ్రీమతి హరిణి, శ్రీ సాయిచరణ్, శ్రీ కృష్ణచైతన్య, అర్కెస్ట్రా నిర్వహణ, కీబోర్డు: శ్రీ గురుప్రసాద్, తబల: శ్రీ జయకుమారాచార్యులు, సౌండ్ ఇంజీనీర్ స్పెషల్ ఎఫెక్ట్స్: శ్రీ నందీశ్వరరావు. దీనికి తెలంగాణ చరిత్ర సంస్కృతిని తెలిపే వీడియోలు సమకూర్చినది శ్రీ దూలం సత్యనారాయణగారు. తల్లి తెలంగాణ ప్రార్థనాగీతం ఈ పాట అన్ని సభల అన్ని సందర్భాలకు అనువుగా ఉంటుంది. వందనమిదె వందనమిదె తెలంగాణ తల్లీ వరదాయని సుమధారిణి వఱలు కల్పవల్లీ                /వందనమిదె/ శృంఖలాలు ఛేదించిన శూర ధీర నీవమ్మా పంటసిరుల పొంగించే బతుకమ్మవు నీవమ్మా కృష్ణమ్మను కొంగువేసి గోదావరి నడికట్టుగ మంజీరగ మానేరుగ మమ్ము గాచు మా తల్లీ                            /వందనమిదె/ శాతవాహన రాజ్య సిరిపొలము నీ చీర కాకతీయ వైభవమది ఘనమైన మకుటమ్ము అమరవీరుల రుధిరమె అలరారే పారాణి  ఆది తెలుగుల చరిత అవతారమె నీవూ     ...